విద్యార్థుల హాజరుపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్

Monday, August 11, 2025 02:57 PM News
విద్యార్థుల హాజరుపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థుల హాజరు అతి తక్కువగా ఉన్న జిల్లాల వివరాలను సేకరిస్తోంది. గతేడాది నుంచి విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తక్కువ హాజరు నమోదవుతున్న పాఠశాలల గురించి విద్యాశాఖ ఆరా తీస్తోంది. రాష్ట్రంలో మొత్తం 634 మండలాల్లో దాదాపు 1,817 వరకు క్లస్టర్లు ఉన్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: