ఉద్యోగి నిరసనపై స్పందించిన టీసీఎస్
Monday, August 4, 2025 08:21 PM News
పూణేలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయం బయట ఓ ఉద్యోగి నిద్రిస్తూ నిరసన తెలుపుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీసీఎస్ స్పందించింది.
సౌరభ్ మోర్ అనే ఉద్యోగి టీసీఎస్ నెలల తరబడి తన జీతం చెల్లించలేదని పేర్కొన్నారు. “నా దగ్గర డబ్బు లేదని, టీసీఎస్ బయట ఫుట్‌పాత్‌లో నిద్రపోయి నివసించాల్సి వస్తుందని నేను హెచ్ ఆర్ కు తెలియజేసాను." అని తన లేఖలో రాశారు. దీనిపై టీసీఎస్ స్పందిస్తూ ఉద్యోగి అనధికారికంగా పనికి గైర్హాజరు కావడంతో అతని జీతం నిలిపివేయబడిందని తెలిపింది. అప్పటి నుండి అతనికి వసతి కల్పించబడిందని, ఇకపై కార్యాలయం వెలుపల క్యాంపింగ్ చేయడం లేదని వెల్లడించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



