రూపాయి కరెన్సీ సింబల్ తొలగించిన తమిళనాడు ప్రభుత్వం
Thursday, March 13, 2025 04:22 PM News

తమిళనాడు సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య హిందీ భాషా అంశంపై ఘర్షణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బడ్జెట్ లోగోలో భారీ మార్పు చేసింది. బడ్జెట్ లోగోలో ఉండే రూపాయి గుర్తు స్థానంలో తమిళ అక్షరాన్ని చేర్చింది. ఈ బడ్జెట్ ప్రతులను శుక్రవారం అసెంబ్లీలో ప్రజెంట్ చేయనున్నారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కేంద్రం వత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. కానీ డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు సర్కారు మాత్రం హిందీ భాషను మూడవ భాషగా నేర్చుకునేందుకు వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం, తమిళనాడు మధ్య వైరం నడుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: