14,582 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2025 సంవత్సరానికి గాను కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్ష నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది.
మొత్తం ఖాళీలు: 14582
వయస్సు: 1.08.2025 తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి
అర్హత: పోస్టులను అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు 10+2 స్థాయిలో గణితంలో కనీసం 60% మార్కులు లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ప్రారంభం: 9 జూన్ 2025
చివరి తేది: 5 జూలై 2025
దరఖాస్తు ఫీజు: జనరల్ / ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100.
ఎస్సీ/ ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు/ ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు లేదు
ఎంపిక విధానం: టైర్-1, టైర్-2, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
వెబ్ సైట్ : https://ssc.gov.in

.jpg)
.jpg)
.jpg)