ఆలయం వద్ద తొక్కిసలాట.. ఆరుగురి మృతి
Sunday, July 27, 2025 12:08 PM News
ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ లోని మన్సాదేవి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయానికి భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



