నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Monday, August 18, 2025 07:10 AM News
అల్పపీడన ప్రభావంతో ఈ రోజు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో విశాఖ, అల్లూరి, విజయనగరం జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు పశ్చిమగోదావరి, అనకాపల్లి, కాకినాడకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఈ జిల్లాలోనూ సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)