ఓబులాపురం మైనింగ్ నిందితులకు ఊరట
Wednesday, June 11, 2025 10:58 AM News
ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగియగా నేడు తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో నిందితులైన బీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దేశం విడిచి వెళ్ళరాదని, రూ.10లక్షలు సొంత పూచీకత్తు సమర్పించాలని తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)