నేడు బెంగళూరులో ప్రధాని మోడీ పర్యటన
Sunday, August 10, 2025 06:43 AM News
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బెంగళూరులో పర్యటిస్తారు. నగర వాసులకు ఒకే రోజు రెండు కీలకమైన కానుకలు అందించనున్నారు. నగరంలో అత్యంత కీలకమైన మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, మూడు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.
ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో బెంగళూరు నగర పోలీసులు నగరంలో, ప్రవేశ, నిష్క్రమణ ప్రదేశాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు, హోటళ్ళు, పీజీ వసతి గృహాలు, అతిథి గృహాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్సు, రైల్వే మరియు మెట్రో స్టేషన్లలో భద్రతను పెంచారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



