పోసాని ఖైదీ నంబర్ ఇదే..

రాజంపేట సబ్ జైలుకు పోసాని కృష్ణమురళి తరలించారు. పోసాని కృష్ణమురళికి ఖైదీ నంబర్ 2261 కేటాయించారు. పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించిన రైల్వే కోడూరు కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
ఇదిలా ఉండగా నిన్న రాత్రి 9 గంటల పాటు సినీ నటుడు పోసాని కృష్ణమురళిని విచారించిన తరువాత పోలీసులు 9.30 గంటలకు జడ్జీ ముందు హాజరుపరిచారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. దాదాపు 7 గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. ఇరు పక్షాల వాదనల అనంతరం పోసానికి మార్చి 13 వరకు అనగా 14 రోజుల రిమాండ్ విధించింది. మేజిస్ట్రేట్ ముందు పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పోసాని పై బీఎన్ఎస్ సెక్షన్ 111(1), సెక్షన్ 196(1), సెక్షన్ 79, సెక్షన్ 192, ఐపీసీలోని 354 ఏ1(4), 505(1) (సీ) సెక్షన్ల కింద పోసాని పై కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయని కోర్టు పేర్కొంది.