బోనాలపై పోలీసుల ఆంక్షలు
Friday, July 4, 2025 08:00 AM News
బోనాల ఉత్సవాలపై తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధించారు. బోనాల ఉత్సవాల్లో డీజేకు నో పర్మిషన్ అంటూ పోలీసులు ప్రకటించారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో డీజేకు అనుమతులు లేవని డీసీపీ రష్మీ తెలిపారు.
మహంకాళి బోనాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన డీసీపీ మీడియాతో మాట్లాడారు. భక్తుల భద్రత కోసం 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
