పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో ఇలా తెలుసుకోండి...
Sunday, August 3, 2025 07:00 AM News
పీఎం కిసాన్ 20వ విడత నిధులను ప్రధాని మోదీ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. 9.7 కోట్ల మంది రైతులకు రూ.2 వేల చొప్పున రూ.20 వేల కోట్లు రిలీజ్ చేశారు. https: //pmkisan.gov.in వెబ్సైట్లో స్టేటస్ ఆప్షన్ ఎంపిక చేసుకుని, మీ రిజిస్ట్రేషన్ నంబర్, OTP ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలి.
అప్పుడు మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో స్టేటస్ తెలుస్తుంది. ఏపిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.2 వేలకు రూ.5 కలిపి మొత్తం రూ.7 వేలను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



