కోటి మొక్కలు నాటిన వనజీవి కన్నుమూత
Saturday, April 12, 2025 07:07 AM News

పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా ఆయన పేరు గాంచారు. ఆయనను 2017లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి ఆయన స్వస్థలం.
గత ప్రభుత్వం హరితహారంలో భాగంగా రామయ్యను రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. "ఒక గుడి లేక బడి ఎక్కడైనా ఒక మొక్క నాటండి." అనే నినాదంతో భావి తరాలకు మెరుగైన ఫలాలను అందించాలన్న సంకల్పంతో నేటి యువత మందుకెళ్ళాలనే సత్ సంకల్పాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లి నర్సరీల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: