సెప్టెంబర్ 1 నుంచి నూతన బార్ పాలసీ

Monday, August 4, 2025 07:19 PM News
సెప్టెంబర్ 1 నుంచి నూతన బార్ పాలసీ

సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో నూతన బార్ పాలసీ అమలు చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా బార్ పాలసీ ఉంటుందన్నారు. ఆల్కహాల్ తక్కువ ఉన్న మద్యం విక్రయాలతో నష్టం తగ్గించవచ్చన్నారు. బార్ల కేటాయింపులోనూ గీత వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు తెలిపారు.

మద్యం కారణంగా పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాలన్నారు. బార్లలో కూడా కల్లు గీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటికే మద్యం షాపుల్లో పది శాతం షాపులు.. కల్లు గీత కార్మికులకు కేటాయించింది ప్రభుత్వం. ఇప్పుడు బార్ లైసెన్స్ లో కూడా ప్రాధాన్యత ఇవ్వనుంది. 840 బార్లలో.. 84 బార్లు కల్లు గీత కార్మికులకు వచ్చే అవకాశం ఉంది

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: