అమృత ప్రణయ్ షాకింగ్ పని.. మండిపడుతున్న నెటిజన్లు

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రణయ్ తల్లిదండ్రులు కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. తీర్పు తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు తమ కొడుకు సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటించి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అమృత మాత్రం భర్త సమాధి దగ్గరకు వెళ్లలేదు.
తుది తీర్పు వచ్చిన తర్వాత ఇంస్టాగ్రామ్ లో రెస్ట్ ఇన్ పీస్ అని మాత్రమే పోస్ట్ చేశారు. ఇదే సమయంలో అమృత చేసిన పనితో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకాలం అమృత ప్రణయ్ గా ఉన్న అకౌంట్ పేరును కాస్త అమృత అమృత వర్షిని అనే పేరుగా మార్చేశారు. భర్త మరణం తర్వాత ఫైనల్ తీర్పు రాగానే అమృత ప్రణయ్ అన్న పేరులోని ప్రణయ్ పేరును తీసివేయడంతో నెటిజన్లు కొత్త చర్చ మొదలుపెట్టారు.
అమృత కొత్త జీవితం స్టార్ట్ చేసిందని రెండో పెళ్ళికి సిద్ధమైపోయింది అంటూ కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. లేదంటే ఈ సమయంలో ఆమె ప్రణయ్ పేరును తన పేరులో నుంచి ఎందుకు తీసివేసిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకాలం ప్రణయ్ కోసమే బతుకుతున్నట్టుగా చెప్పుకున్న అమృత ఇప్పుడు తన పేరులోంచి ప్రణయ్ పేరును తీసివేయడంతో ఆమె నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నది ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.