కొడుకు వీర్యం కోసం కోర్టు మెట్లు ఎక్కిన తల్లి
తల్లి కొడుకుల మధ్య బంధం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన సంబంధం. ఇటీవల బాంబే హైకోర్టులో ఒక సంచలన పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఒక నిస్సహాయ తల్లి తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చనిపోయిన కొడుకు శుక్రకణం కోసం కోర్టు తలుపులు తట్టింది. ఈ కేసులో నిర్ణయం తీసుకునే వరకు మరణించిన యువకుడి శుక్రకణాలను భద్రంగా ఉంచాలని బాంబే హైకోర్టు సంతానోత్పత్తి కేంద్రాన్ని ఆదేశించింది. ఆమె కుమారుడు క్యాన్సర్ తో పోరాడుతూ మరణించాడు.
అయితే తన కుమారుడు కుటుంబాన్ని సంప్రదించకుండానే మరణానంతరం వీర్యాన్ని నాశనం చేయమని సమ్మతి పత్రాలపై సంతకం చేశారని సంతాన సాఫల్య కేంద్రం (ఐవీఎఫ్) పేర్కొంది! దీనిపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ మనీష్ పటేల్ ఏకసభ్య ధర్మాసనం.. తుది తీర్పు వెలువరించే వరకు వీర్యాన్ని కాపాడాల్సిందేనని సంతాన సాఫల్య కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది.తదుపరి విచారణను జులై 30వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం - 2021లోని నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని వీర్యాన్ని ఎలా సంరక్షించాలనే దానిపై ఈ పిటిషన్ ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని ధర్మాసనం పేర్కొంది. ఫిబ్రవరిలో మరణించే సమయానికి ఆ వ్యక్తి అవివాహితుడని కోర్టు నొక్కి చెప్పింది.

.jpg)
.jpg)
.jpg)