ఏపీ: ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరి
Sunday, March 2, 2025 01:54 PM News

టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
త్వరలోనే ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరి బాధ్యతలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో మహిళల సాధికారిత, అభివృద్ధి కోసం కృషి చేయనున్నారు. తాజాగా ఈ అమ్మడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పోలీస్ అధికారిణిగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: