మైక్రోసాఫ్ట్‌లో మరోసారి భారీగా లేఆఫ్‌లు

Thursday, July 3, 2025 01:07 PM News
మైక్రోసాఫ్ట్‌లో మరోసారి భారీగా లేఆఫ్‌లు

మైక్రోసాఫ్ట్ ఈ ఏడాదిలో రెండోసారి భారీ స్థాయిలో లేఅఫ్‌కి పాల్పడింది. మే నెలలోనే దాదాపు 6,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆ వెంటనే జూన్‌లో మరో 300 మందికిపైగా ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు జూలై వచ్చేసరికి మళ్లీ పెద్ద ఎత్తున సుమారు 9,000 మందిని బయటకు పంపినట్లు సమాచారం. మొత్తం కంపెనీ ఉద్యోగులలో దాదాపు 4 శాతం మందిని ఈసారి టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. టెక్నాలజీ, మార్కెటింగ్ విభాగాల్లో ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది.

మైక్రోసాఫ్ట్ తాజా 4 శాతం ఉద్యోగుల తొలగింపులు ప్రధానంగా సేల్స్, మార్కెటింగ్, గేమింగ్ (ఎక్స్‌బాక్స్, కింగ్, జెని మ్యాక్స్, టర్న్ 10) విభాగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎక్స్‌బాక్స్ గ్రూపులో ముఖ్యంగా భారీ కోతలు జరిగాయి. ఉదాహరణకు టర్న్ 10 స్టూడియోలో సగానికి పైగా ఉద్యోగులు కోల్పోయారు, అలాగే కింగ్ డివిజన్‌లో 10 శాతం ఉద్యోగాలు తొలగించబడ్డాయి. ప్రముఖ గేమ్ ప్రాజెక్టులు అయిన పెరఫెక్ట్ డార్క్, ఎవర్ విల్డ్ వంటి గేమ్స్ రద్దయ్యాయి, The Initiative వంటి స్టూడియోలు మూసివేయబడ్డాయి. జెని మ్యాక్స్, రావెన్ సాఫ్ట్ వేర్, స్లెడ్జ్‌హ్యామర్ గేమ్స్, రేర్ వంటి అనేక స్టూడియోలు కూడా ఈ లేఅవ్‌ల వల్ల ప్రభావితమయ్యాయి.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: