టీసీఎస్ కు కార్మిక శాఖ నోటీసులు
Saturday, August 2, 2025 11:07 AM News
ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగుల తొలగింపు ప్రకటన, బలవంతపు రాజీనామాల చుట్టూ చెలరేగిన వివాదం నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం (KITU) పారిశ్రామిక వివాదంపై కేసు దాఖలు చేసింది. దీంతో కార్మిక శాఖ ఆ కంపెనీకి నోటీసు పంపింది. సమావేశానికి హాజరు కావాలని కోరింది.
తమ హెల్ప్లైన్కు 25 కంటే ఎక్కువ కాల్స్ వస్తున్నాయని, తమ ఉద్యోగులను రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారని కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం ఆరోపిస్తోంది. జూలై 27న TCS తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో 2 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీని వలన 12,000 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)