పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Saturday, August 30, 2025 06:04 AM News
వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.
తనను తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తాడిపత్రి వెళ్లేందుకు అనుమతిచ్చింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



