ఎవరీ నిమిష ప్రియ.. ఏమిటీ కథ...
నిమిష ప్రియ కేరళకు చెందిన నర్స్. పాలక్కాడ్ ఆమె స్వస్థలం. 2008లో ఉపాధి కోసం యెమెన్ వెళ్లారు. అక్కడ తలాల్ మహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించారు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తనను వివాహం చేసుకున్నాడని, వేధిస్తున్నాడని నిమిషా ఆరోపించారు. అంతే కాకుండా పాస్‌పోర్ట్‌ను కూడా లాక్కున్నాడని తెలిపారు.
2017లో తలాల్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మత్తు మందు ఇచ్చి పాస్‌పోర్ట్ తిరిగి తీసుకోవడానికి నిమిషా ప్రయత్నించారని, డ్రగ్స్ డోస్ ఎక్కువ అవడం వల్ల అతను మరణించాడని యెమెన్ అధికారులు నిర్దారించారు. ఈ కేసులో నిమిషాను అరెస్టు చేసి 2018లో దోషిగా నిర్ధారించారు.
ఆమెకు విధించిన ఉరిశిక్షను అప్పట్లో మే 16న అమలు చేయాల్సి ఉండగా వాయిదా వేశారు. దీనిపై భారత ప్రభుత్వం తరపున పలు ప్రయత్నాలు జరిగాయి. నిమిషకు తొలుత జూలై 16న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. 2020లో ఆమెకు మరణ శిక్ష విధించగా, 2023లో ఆమె చివరి అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. తాజాగా మరణ శిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.



