వర్క్‌ఫ్రమ్‌ హోం, ఐటీ కంపెనీలకు కర్నాటక సర్కార్‌ రిక్వెస్ట్‌

Wednesday, August 25, 2021 06:23 PM News
వర్క్‌ఫ్రమ్‌ హోం, ఐటీ కంపెనీలకు కర్నాటక సర్కార్‌ రిక్వెస్ట్‌

ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీగా పేరుపొందిన బెంగళూరులో  వేల సంఖ్యలో ఇక్కడ ఐటీ కంపెనీలు ఉన్నాయి. లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఈ నగరంలో నివసిస్తున్నారు. అయితే 2020లో వచ్చిన కరోనాతో అన్ని ఐటీ కంపెనీలు ఆఫీసులకు తాళాలు వేసి వర్క్‌ఫ్రం హోం అమలు చేస్తున్నాయి.

ఇటీవల పరిస్థితులు కొంత చక్కబడటంతో తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా కొన్ని ఐటీ కంపెనీలు ఐటీ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని మరో ఏడాదిన్నర పాటు వాయిదా వేసుకోవాలని కర్నాటక ప్రభుత్వం కోరింది. 2022 డిసెంబరు వరకు వర్క్‌ఫ్రం హోం అమలు చేయాలని ఐటీ కంపెనీలకు సూచించింది.

దీనికి ప్రధానకారణం ఉంది, సిల్క్‌  బోర్డు నుంచి కేఆర్‌పురం వరకు మెట్రో రైలు నిర్మాణ పనులుమొదలుపెట్టారు, దాదాపు రెండేళ్ల పాటు ఈ పనులు సాగుతాయని ఫలితంగా ఈ మార్గంలో తీవ్ర ట్రాఫిక్‌ జాం సమస్యలు తలెత్తుతాయని కర్నాటక ప్రభుత్వం చెబుతోంది. ఈ మార్గంలో చాలా ఐటీ కంపెనీలు ఉన్నందువలన మెట్రో పనులు పూర్తయ్యే వరకు ఐటీ కంపెనీలు వర్క్‌హోం అమలు చేయాలంటూ నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్‌కామ్‌)కి కర్నాటక ప్రభుత్వం లేఖ రాసింది.

For All Tech Queries Please Click Here..!
Topics: