అమెరికా సుంకాల మోత.. స్పందించిన భారత్
Thursday, July 31, 2025 09:30 AM News
భారత్ పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. పెనాల్టీతో కలిపి ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. దీనిపై భారత్ తాజాగా స్పందించింది.
బ్రిటన్ తో ఇటీవల కుదుర్చుకున్న 'ఎఫ్.టీ.ఏ' సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే ఈ వ్యవహారంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ ఆకస్మిక ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



