కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం
Tuesday, August 12, 2025 11:29 AM News
లోక్ సభలో ఆదాయపు పన్ను బిల్లు-2025, పన్నుల చట్టాల సవరణ బిల్లు-2025 మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. SIR ప్రక్రియను వ్యతిరేకిస్తూ విపక్షాలు చేస్తున్న నిరసనల మధ్యనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ బిల్లులపై ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఈ కొత్త చట్టాలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బిల్లును విపక్షాల అభ్యంతరాలతో సెలెక్షన్ కమిటీకి పంపి, సిఫార్సులు పరిగణనలోకి తీసుకుని నవీకరించి మరోసారి లోక్సభ ముందు ఉంచారు. పన్ను చెల్లింపుదారుల భారాన్ని తగ్గించేందుకు కొత్త బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)