ఫిబ్రవరి 14న ఓయోకు వెళ్తున్నారా.. అయితే జైలుకే

వాలెంటైన్స్ డే రోజున కొన్ని జంటలు ప్రేమను ఆస్వాదించడానికి ఓయో రూమ్స్ బుక్ చేసుకుంటారు. కానీ, ఇటీవల ఓయో రూమ్స్ బుకింగ్స్‌కి సంబంధించిన కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అందువల్ల, వాలెంటైన్స్ డే కోసం రూమ్ బుక్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
ఓయో హోటల్లో చెక్ఇన్ సమయంలో జంటలు తమ సంబంధాన్ని నిర్ధారించే పత్రాలు చూపించాల్సి ఉంటుంది. అవి జాయింట్ ఐడీ లేదా మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైనా ఓయో రూమ్స్ ప్రతినిధులకు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా రూమ్ బుక్ చేసుకున్నా, చెక్ఇన్ సమయంలో అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. పెళ్లి కాని జంటల కోసం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు.
ప్రతి ఓయో హోటల్‌కు ప్రత్యేక నియమాలు ఉంటాయి. మీరు బుక్ చేసుకునే హోటల్ ఈ నియమాలకు సరిపోతుందా లేదా అని ముందుగా తెలుసుకోండి. కొన్ని ప్రాంతాలలో, కొన్ని హోటల్స్ పెళ్లికాని జంటలకు రూమ్ ఇవ్వకుండా ఉండొచ్చు. అలాంటి హోటల్స్‌లో బుకింగ్ చేసుకునే ముందు నిబంధనలను ఖచ్చితంగా తెలుసుకోండి. చెక్ఇన్ సమయంలో జంటలు ప్రభుత్వ ఆమోదిత ఐడీని చూపించాల్సి ఉంటుంది. భాగస్వాములిద్దరినీ వారి ఐడీలతో ఓయోలకు వెళ్లాల్సి ఉంటుంది. ఓయో హోటల్స్ వివిధ పాలసీలను అమలు చేస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకునే హోటల్ అవివాహిత జంటలను అంగీకరిస్తుందా? లేదా? ముందుగా తెలుసుకోండి. ఓయో హోటల్స్ అనేక ప్రాంతాలలో అందుబాటులో ఉన్నా, కొన్ని చోట్ల పెళ్లికాని జంటలకు అనుమతి లేదు. దీంతో, మీరు ముందుగానే దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. దీని కారణంగా మీ ప్లాన్స్ వృథా కాకుండా ఉంటాయి. కొన్ని హోటల్స్ ఆన్లైన్ చెల్లింపులను అంగీకరించకపోవచ్చు. నగదు లేదా క్రెడిట్ కార్డును మాత్రమే అంగీకరించవచ్చు. కాబట్టి చెల్లింపుల గురించి ముందుగానే వివరాలు తెలుసుకోండి.