హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
Wednesday, February 5, 2025 07:06 AM News

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చర్లపల్లి ఇండస్ట్రీయల్ ఏరియాలో మంగళవారం సాయంత్రం సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో దట్టమైన పొగలతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల దాటికి ఫ్యాక్టరీలో ఉన్న కెమికల్స్ బ్యారెల్స్ పేలిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున దట్టమైన పొగ, మంటలు ఎగిసిపడ్డాయి.
ఫ్యాక్టరీ రోడ్డు పక్కనే ఉండటంలో రహదారి అంతా పొగతో కమ్ముకుపోయింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. ఫేస్ 1లో అంటుకున్న మంటలు పక్క బిల్డింగుకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: