బెంగళూరు రైలుకు భలే డిమాండ్..!
అనంతపురం- బెంగళూరు రైలుకు భలే గిరాకీ ఏర్పడింది. ఈ రైలును గత నెల (జూన్) 4న అనంతపురం నుంచి బెంగళూరుకు ప్రారంభించారు. తొలుత పుట్టపర్తి- బెంగళూరు (66559/66560) మధ్య నడుస్తున్న ఈ రైలును అనంతపురం దాకా పొడిగించారు. బెంగళూరులో ఉదయం 8.35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.55 గంటలకు అనంతపురానికి చేరుకుంటుంది. తిరిగి 2.10 గంటలకు బెంగళూరుకు బయలు దేరి రాత్రి 7.50 గంటలకు బెంగళూరు. చేరుకుంటుంది.
ఈ వేళలు ప్రయాణికులకు అంత సౌకర్యవంతంగా ఉండవని తొలుత భావించారు. ప్రయాణికులకు చౌకగా రైలు ప్రయాణం అందుబాటులోకి రావడంతో వేచి ఉండి మరీ వెళుతున్నారు.
సాధారణ రోజుల్లో ఒక్క అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి 500 మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాల్లో అయితే ఆ సంఖ్య 800 వరకు ఉంటుంది. అనంతపురం రైల్వేస్టేషన్లోనే రోజూ 450 నుంచి 650 వరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయి. బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులే కాకుండా పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం ఇలాంటి పట్టణాలకు వెళ్లే వారూ అధికంగానే ఉంటున్నారు. బెంగళూరు నుంచి అనంతపురం దాకా 27 స్టేషన్లలో ఆగుతుండటంతో పల్లెలకు వెళ్లే వారికీ అనుకూలంగా ఉంది. బెంగళూరు, హిందూపురం, పెనుకొండ స్టేషన్ల నుంచి అనంతపురానికి వచ్చే ప్రయాణికులు కూడా 500 మంది ఈ రైల్లో వస్తున్నారు.

.jpg)
.jpg)
.jpg)