శ్రీశైలం వెళ్ళే భక్తులకు గుడ్ న్యూస్
Wednesday, July 2, 2025 09:00 AM News
శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులు భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం భాగ్యాన్ని భక్తులకు ఉచితంగానే కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. దీనిలో భాగంగా రోజుకు 1000 నుంచి 1200 మందికి ఉచిత స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండ టోకెన్లు దేవస్థానం వద్దే జారీ చేస్తామని ఏ రోజు టోకెన్లు ఆ రోజే ఇస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
