AP Budget: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు భారీగా నిధులు కేటాయింపు
_(15)-1740723237.jpeg)
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులను ఈ బడ్జెట్ లో కేటాయించారు. 2025-26 ఆర్దిక సంవత్సరంలో తల్లికి వందనం అమలు కోసం రూ 9,407 కోట్లను ప్రతిపాదించారు. ఎంత మంది పిల్లలు ఉన్నా అంతమందికి రూ.15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మే నెలలో ఈ పథకం కింద నిధులు జమ చేయనుంది.
ఇందు కోసం ఈ బడ్జెట్ లో రూ 9,407 కోట్లు ప్రతిపాదన చేసారు. దాదాపు గా రూ 11 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు తొలుత అంచనా వేసారు. కాగా, మార్గదర్శ కాల తరువాత లబ్ది దారుల సంఖ్య, ఖర్చు పైన స్పష్టత రానుంది. కొత్త విద్యా సంవత్సరం ఆరంభంలో ఈ నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రూ.6300 కోట్లు ప్రతిపాదించారు. రైతు అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయింపు చేసారు. అన్నదాత సుఖీభవ పథకం మూడు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో కలిపి ఈ పథకం అమలు కానుంది. కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహాయించి.. రాష్ట్రం హామీ ఇచ్చిన 20 వేలలో మిగిలిన రూ 14 వేలను మూడు సార్లు గా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.