మహిళకు ఉచిత బస్సు పథకం పేరు ఖరారు.. టికెట్ ఇలా..

Thursday, July 31, 2025 09:14 PM News
మహిళకు ఉచిత బస్సు పథకం పేరు ఖరారు.. టికెట్ ఇలా..

ఏపిలో ఆగస్టు 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్న సంగతి తెలిసిందే. ఆ పథకం పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. 'స్త్రీ శక్తి' అని ఆ పథకానికి పేరు పెట్టారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే టికెట్లపై " స్త్రీ శక్తి " అని ముద్రించనున్నారు.  

కాగా ఇందుకు సంబంధించిన జీరో టికెట్ నమూనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కీమ్ పేరును (స్త్రీశక్తి) దీనిపై ముద్రించారు. టికెట్ రేట్ పై ప్రభుత్వం పూర్తి రాయితీ ఇస్తుండటంతో '0' టికెట్ ముద్రణ పైవిధంగా ఉంటుంది. అయితే ఆర్టీసీ దీన్ని అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డుతో మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: