Breaking: మాజీ గవర్నర్ కన్నుమూత
Tuesday, August 5, 2025 02:11 PM News
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(79) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. 2019లో ఆర్టికల్ 370 ఎత్తేసిన సమయంలో ఆయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్నారు. సత్యపాల్ మాలిక్ బిహార్, గోవా, మేఘాలయ గవర్నర్ గా కూడా పని చేశారు. ఒడిశా గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
