27 మంది మృతి.. మృతుల్లో ఆరుగురు చిన్నారులు

Sunday, July 6, 2025 01:00 PM News
27 మంది మృతి.. మృతుల్లో ఆరుగురు చిన్నారులు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ఇక్కడి నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. మరోవైపు కెర్ కౌంటీలోని గ్వాడలూప్ నది ఉప్పొంగి సమీపంలోని మిస్టిక్ క్యాంప్ వేసవి శిక్షణా శిబిరాన్ని ముంచెత్తింది. దీంతో శిబిరంలోని 23 మంది బాలికలు గల్లంతయ్యారు. వారికోసం అధికారులు గాలిస్తున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: