రాహుల్ గాంధీ డిమాండ్ ను తిరస్కరించిన ఈసీ

Sunday, June 22, 2025 10:00 AM News
రాహుల్ గాంధీ డిమాండ్ ను తిరస్కరించిన ఈసీ

మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ లలోని సిసి టీవీ ఫుటేజ్ విడుదల చేయాలనే రాహుల్ గాంధీ డిమాండ్ ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇలా చేయడం వలన ఓటర్ల గోప్యత హక్కును భంగం కలిగించడమే అవుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ పోలింగ్ బూతులలో రికార్డ్ అయిన సిసిటీవీ విడుదల చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇలా ఉండగా, ఎన్నికల ఫలితంపై 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే సదరు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ కెమెరా రికార్డింగ్‌లు, వెబ్ కాస్టింగ్ , వీడియో ఫుటేజ్‌లను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు మే 30న ఎన్నికల సంఘం లేఖలు పంపింది. ఈ నేపథ్యమే ప్రస్తుత చర్చకు దారితీసింది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: