నేడు డీఎస్సీ మెరిట్ లిస్ట్?

Thursday, August 21, 2025 07:10 AM News
నేడు డీఎస్సీ మెరిట్ లిస్ట్?

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి మెరిట్ లిస్ట్ గురువారం విడుదల కానుంది. మెరిట్ లిస్ట్ తో పాటు అభ్యర్థుల ధ్రువపత్రాల షెడ్యూల్, నియామకాల షెడ్యూల్ను కూడా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రాష్ట్రప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ పరీక్షల తుది 'కీ'ని విడుదల అభ్యర్ధుల స్కోరు కార్డుల విడుదల ప్రక్రియను ఈ నెల 15వ తేదీతో పూర్తిచేసింది. మెరిట్ జాబితా లేకుండానే నేరుగా ధ్రువపత్రాల పరిశీలన చేయాలని పాఠశాల విద్యాశాఖ ముందుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంతో మరలా తన నిర్ణయాన్ని మార్చుకునట్లు సమాచారం.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: