Breaking: డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా
మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించింది.
ఇప్పటికే డీఎస్సీ మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. డీఎస్సీలో వచ్చిన స్కోర్ తో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు. రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్ లెటర్లు జారీచేయాల్సి ఉంటుంది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఒకటికి రెండుసార్లు జాబితాలను పరిశీలిస్తున్నారు. విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్ కు కాల్ లెటర్లు పంపించి, సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సి ఉంది. కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. కాల్ లెటర్లను ఈ రోజు ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్ లో ఉంచనున్నారు
.
.jpg)
.jpg)
.jpg)