డిజిటల్ బ్యాంకింగ్, యుపీఐ సేవలు బంద్
Tuesday, April 1, 2025 02:12 PM News
_(1)-1743496929.jpeg)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కీలక అప్ డేట్ ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని వెల్లడించింది. వార్షిక క్లోజింగ్ యాక్టివిటీ కారణంగా సేవల్లో అంతరాయం కలిగిస్తున్నందుకు చింతిస్తున్నట్లు కస్టమర్లకు మెసేజ్ ద్వారా ముందుగానే వెల్లడించింది.
భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 1 మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంటే దాదాపు 3 గంటల పాటు కస్టమర్లకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యోనో బినినెస్ వెబ్ అండ్ యాప్, యోనో, యూపీఐ సేవలు అందుబాటులో ఉండబోవని తన అధికారిక వెబ్ సైట్లో కూడా వెల్లడించింది. ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ కస్టమర్లు తమ యూపీఐ లైట్, ఏటీఎం వంటి పద్ధతుల్లో తమ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసుకోవచ్చని బ్యాంక్ సూచించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: