డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అరుదైన వ్యాధి

Thursday, February 6, 2025 11:21 AM News
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అరుదైన వ్యాధి

ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా జనసేన అధికార సోషల్ మీడియాలోనే పోస్ట్ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారని, జ్వరంతోపాటు స్పాండిలైటిస్ కూడా బాధపెడుతోందని తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారని పేర్కొన్నారు. పవన్ అనారోగ్యంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇక ఆ నొప్పికి కారణం స్పాండిలైటిస్ అనే తెలుస్తుంది. దీంతో అది అసలు ఎలాంటి వ్యాధి.. దేనివలన వస్తుంది.. ? దాని లక్షణాలు ఏంటి.. ? అని నెటిజన్స్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

స్పాండిలైటిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్ లో అరుదైన వ్యాధి. మహిళల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తుంది. రోజు జీవించే జీవన విధానంలో వచ్చే మార్పుల వలన ఈ వ్యాధి వస్తుంది. మెడ నుంచి వెన్నుముక వరకు ఉండే డిస్కుల్లో కొన్ని నరాలు ఉంటాయి. వాటి మధ్య ఎక్కువ ఒత్తిడి పడినా.. లేక ఎక్కువ సమయం రెస్ట్ లేకుండా పనిచేసినా లోపల నరాలు ఒత్తిడికి గురై విపరీతమైన వెన్ను నొప్పి వస్తుంది. వెన్ను నొప్పితో పాటు మెడ లాగేస్తున్నట్లు అనిపిస్తుంది. కనీసం మెడను పక్కకు కూడా తిప్పనివ్వదు. ఇక అంత విపరీతమైన మెడనొప్పి వచ్చినప్పుడు తల తిరగడం, కళ్లు తిరిగి పడిపోవడం, నడుస్తున్నప్పడు ముందుకు తూలుతున్నట్లు అనిపించడం జరుగుతుంది. వీటితో పాటు వాంతులు, వికారం, జ్వరం.. ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండకపోవడం లాంటివి కనిపిస్తాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: