భర్త అక్రమ సంబంధం భార్య పట్ల క్రూరత్వం కిందకి రాదు: హైకోర్టు
Wednesday, May 14, 2025 12:00 PM News

భర్తకు వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన అది భార్య పట్ల క్రూరత్వంగానీ, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపణగానీ కాబోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మృతురాలిని ఉద్దేశపూర్వకంగా వేధించినట్లు లేదా హింసించినట్లు నిరూపించనంత వరకు దీనిని నేరంగా పరిగణించలేమని పేర్కొంది. వివాహం జరిగిన ఐదేళ్ల లోపే అనుమానాస్పద రీతిలో మరణించిన భార్య కేసులో ఈ తీర్పు వెలువరించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడైన భర్తకు ఈ సందర్భంగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: