పాశమైలారం ఘటనలో తేలిన మృతుల సంఖ్య.. కంపెనీ కీలక ప్రకటన
Wednesday, July 2, 2025 01:32 PM News
తెలంగాణలోని పాశామైలారంలో ప్రమాదంపై సిగాచీ పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పేలుడు కారణంగా 40 మంది మృతి చెందినట్లు అందులో పేర్కొంది. మరో 33 మంది గాయపడినట్లు తెలిపింది. అయితే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది.
గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని,అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చింది. సిగాచీ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)