వరుసగా నాలుగు రోజులు సెలవులు

Sunday, March 2, 2025 10:00 AM News
వరుసగా నాలుగు రోజులు సెలవులు

మార్చిలో వరుసగా నాలుగు రోజులు పాఠశాలలకు, కాలేజీలకు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రానున్నాయి. హోలీ నుంచి వరుసగా 4 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ సమయంలో పాఠశాలలకే కాదు కాలేజీలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేయవు. ఈ నెలలో బ్యాంకులు కూడా కేవలం 14రోజులు మాత్రమే పనిచేస్తాయి.

యూపీలో హోళికా దహనం వైభవంగా జరుపుకుంటారు. ఆ రాష్ట్ర క్యాలెండర్ ప్రకారం హోలికా దహనం మార్చి 13న నిర్వహిస్తారు. ఆ రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు. హోలి పండగ శుక్రవారం వస్తుంది. శనివారం కొన్ని పాఠశాలలకు సెలవు ఉంటుంది. మార్చి 15 ఆదివారం ఆ రోజు కూడా సెలవు. ఇలా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. హోలీ రోజు బ్యాంకులు బంద్ ఉంటాయి. తరువాత మార్చి 17వ తేదీన సోమవారం బ్యాంకులు తెరచుకుంటాయి.

ఈ సెలవులు పూర్తయిన 12 రోజులకే వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. మార్చి 29వ తేదీ శనివారం, మార్చి 30 ఆదివారంతో పాటు ఉగాడు, మార్చి చివరి తేదీ 31 సోమవారం రంజాన్ వస్తాయి. ఆ రోజు ప్రభుత్వ సెలవు ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: