వివేకా హత్య కేసు, వాచ్‌మన్ రంగన్న మృతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Friday, March 7, 2025 08:11 PM News
వివేకా హత్య కేసు, వాచ్‌మన్ రంగన్న మృతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మన్ రంగన్న మృతి చర్చనీయాంశంగా మారింది. ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో మృతిచెందారని భార్య చెబుతున్నప్పటికీ, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో పరిటాల రవి హత్య కేసులోనూ సాక్షులు అనుమానాస్పదంగా మరణించారని, ఇప్పుడు వివేకా హత్య కేసులోనూ అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయని అన్నారు. వివేకా హత్య సమయంలో జగన్, వైఎస్ భారతి హైదరాబాద్ నుంచి కారులో వచ్చిన విషయంపై, ఆ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మరణించినదానిపై కూడా చర్చ జరిగింది.

వివేకా హత్యకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురు మరణించారని కేబినెట్‌లో చర్చించగా, పోలీసుల హస్తం ఉందన్న ఆరోపణలపై డీజీపీ స్పందించారు. రంగన్న మృతిపై అనుమానాలు నిజమేనని, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలిపారు.2019లో జరిగిన వివేకా హత్య ఎన్నికల ముందు సంచలనం సృష్టించగా, ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తులో ఉంది.
 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: