చంద్రబాబు కారు ఎక్కిన సామాన్యుడు

Wednesday, July 2, 2025 12:00 PM News
చంద్రబాబు కారు ఎక్కిన సామాన్యుడు

తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కారులో స్వయంగా చర్మకారుడు పోశిబాబును ఎక్కించుకున్నారు. కొవ్వూరు మండలం దర్మవరం గ్రామం నుంచి తాళ్లపూడి మండలం మలకపల్లి వరకు సుమారు 2 కి.మీ మేర పోశిబాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించారు.

కారులో వెళ్తున్న సమయంలో పోశిబాబు వృత్తి, జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ నేపథ్యం గురించి పోశిబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోశిబాబు ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: