చంద్రబాబు అల్లు అర్జున్‌ని అరెస్టు చేయొద్దన్నారు.. రేవంత్ రెడ్డి

దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని జాతీయ మీడియా కొన్ని ప్రశ్నలు అడిగింది. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన సదర్భాన్ని గుర్తు చేశారు. ఈ విషయమై అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే.
అయితే అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం మంచిది కాదని చంద్రబాబు నాయుడు చెప్పిన అంశాన్ని రేవంత్ రెడ్డిని అడిగారు. ఇందుకు రేవంత్ ఈ విధంగా స్పందించారు.
న్యూస్ యాంకర్ - అల్లు అర్జున్‌ని అరెస్ట్ చెయ్యడం మంచిది కాదని చంద్రబాబు నాయిడు అన్నారు
రేవంత్ రెడ్డి - అల్లు అర్జున్‌ని ఎందుకు అరెస్ట్ చేసామో చంద్రబాబు నాయుడుకు తెలియదు.. మొత్తం తెలుసుకొని మాట్లాడాలి తొక్కిసలాటలో మహిళ చనిపోతే, అల్లు అర్జున్ 10-12 రోజులు వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోలేదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది- దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి.