లైంగిక సమ్మతికి 18 ఏళ్లు దాటాల్సిందే
Friday, August 8, 2025 10:43 AM News
లైంగిక సమ్మతికి వయోపరిమితిని 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై కేంద్రం స్పందించింది. లైంగిక సమ్మతికి 18 ఏళ్లు దాటాల్సిందే నని స్పష్టం చేసింది. మైనార్టీ తీరని వారిని లైంగిక మోసాల నుంచి కాపాడేందుకు బాగా ఆలోచించి ఈ విధానం అమలు చేస్తున్నామని తెలిపింది.
యువతీ యువకుల మధ్య శృంగార భరిత ప్రేమ పేరుతో ఈ పరిమితిని తగ్గించడం ప్రమాదకరమని, తగ్గిస్తే పిల్లల అక్రమ రవాణా, బాలలపై నేరాలు పెరుగుతాయని అభిప్రాయపడింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)