భారీగా తగ్గనున్న ధరలు

Wednesday, July 2, 2025 03:00 PM News
భారీగా తగ్గనున్న ధరలు

కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి, పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిత్యావసర వస్తువుల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 శాతం పన్ను శ్లాబును 5 శాతం స్లాబ్ తీసుకొచ్చి యోచనలో ఉంది. ఈ నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే టూత్ పేస్ట్, కుక్కర్లు, గీజర్లు సైకిలు వంటి వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల భారం పడొచ్చని అంచనా. అయినప్పటికీ, ధరలు తగ్గితే వినియోగం పెరిగి, దీర్ఘకాలంలో పన్ను వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటీవల పరోక్షంగా సంకేతాలిచ్చారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: