KL యూనివర్సిటీపై CBI మెరుపు దాడులు.. 10 మంది అరెస్ట్
Sunday, February 2, 2025 12:51 PM News

సిబిఐ ఏకకాలంలో 20 విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహించింది. గుంటూరు జిల్లాలోని కెఎల్ వర్సిటీ యాజమాన్యంపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎన్ఎఎసి రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు రావడంతో సిబిఐ దాడులు చేసింది. మొత్తం 14 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు 10 మందిని అరెస్టు చేశారు. ఎన్ఎఎసి ఇన్‌స్పెక్షన్ టీమ్ చైర్మన్ సమరేంద్ర సహా ఏడుగురిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు.
నిందితుల జాబితాలో వర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఎన్ఎఎసి మాజీ డిప్యూటీ అడ్వైజర్ మంజునాథరావు, ఎన్ఎఎసి అడ్వైజర్ శ్యామ్ సుందర్, డైరెక్టర్ హనుమంతప్ప ఉన్నారు. ఈ నలుగురు మినహా 10 మంది అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.37 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: