యూట్యూబర్ సన్నీ యాదవ్ పై కేసు
Wednesday, March 12, 2025 03:27 PM News

యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు అయింది. ఈ విషయాన్ని పోలీసులు ప్రకటించారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్ల పై నేను చేసిన ‘ఎక్స్’ పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ, సూర్యపేట ఎస్పీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు.
కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదని, చట్టప్రకారం మీరు శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. మాకు మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్కపెట్ట తప్పదని చురకలు అంటించారు. ఇక ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారణంగా ఇప్పటికే ఏపీలో యూట్యూబర్ నానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: