లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
Wednesday, March 12, 2025 10:21 AM News
బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి కేంద్ర కారాగారంలో లొంగిపోయారు. మంగళవారం సాయంత్రంతో (మార్చి 11) ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. కానీ గడువు సమయానికి లొంగిపోయేందుకు ఆయన జైలుకు రాకపోవడంతో సంబంధిత అధికారులు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ఈ రోజు జైలులో లొంగిపోయారు.
ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ కోసం రాజమండ్రి జైలుకు గుంటూరు పోలీసులు వెళ్లారు. పాస్టర్ ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటనలో పీటీ వారెంట్పై బోరుగడ్డను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకురానున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



