మతి స్థిమితం లేని వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టిన పోలీసులు, వీడియో ఇదిగో

Monday, March 3, 2025 11:38 AM News
మతి స్థిమితం లేని వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టిన పోలీసులు, వీడియో ఇదిగో

బీహార్‌లోని కతిహార్ జిల్లాలో పోలీసుల అమానుష చర్యలు వెలుగులోకి వచ్చాయి. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి పోలీసు వాహనానికి ఆనుకుని కూర్చొనగా, ఆగ్రహించిన పోలీసులు అతడిపై దాడి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనపై విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తడంతో, కతిహార్ ఎస్పీ వైభవ్ శర్మ స్పందించి అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ కేదార్ ప్రసాద్ యాదవ్, కానిస్టేబుల్ ప్రీతి కుమారిని సస్పెండ్ చేశారు. హోంగార్డులు సికందర్ రాయ్, కిషోర్ మహతోలను ఏడాది పాటు విధుల నుండి తప్పించారు. దాడిలో పాల్పడిన ప్రైవేట్ డ్రైవర్ బంబం కుమార్‌పై కేసు నమోదు చేశారు. డిప్యూటీ ఎస్పీ ధర్మేంద్ర కుమార్‌కు ఈ ఘటనపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: