బెంగళూరులో వారికి నో ఎంట్రీ..!
Tuesday, January 28, 2025 04:00 PM News

కన్నడ భాషా ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సారి సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. కన్నడ నేర్చుకునేందుకు ఇష్టపడనివారికి బెంగళూరు దారులు మూసుకుపోయాయని ఓ వ్యక్తి ఎక్స్‌లో చేసిన పోస్టు తాజాగా వైరలైంది.
‘కన్నడ భాష నేర్చుకోవడానికి ఇష్టపడని ఉత్తరాదివారు, పొరుగు రాష్ర్టాల ప్రజలకు బెంగళూరు దారులు మూసుకుపోయాయి’ అని బబ్రువాహన అనే వ్యక్తి చేసిన ట్వీట్ నెట్టింట చర్చకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా కన్నడ, కన్నడేతరుల మధ్య అగ్గి రాజేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: