ఉచితంగా రూ.5 లక్షల బీమా.. ఎలా పొందాలంటే..

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల బీమా పథకం 70 ఏళ్ళు దాటిన వృద్ధులకు కూడా వర్తించనుంది. ఏప్రిల్ నుంచి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీం అమలు కానుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమా అందించనుంది. ఇందులో ఉచిత చికిత్సతో పాటు సర్జరీలు, మందులు అందించనుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు 416 నెట్వర్క్ ఆసుపత్రులకు తాజాగా ఆదేశాలు కూడా ఇచ్చారు .
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆరోగ్య బీమా ఎన్నో ఆసుపత్రులు లింక్ అయి ఉన్నాయి. ప్రభుత్వం నేరుగా ఆస్పత్రులకు బిల్లు చెల్లిస్తుంది. అయితే దీనికి ముందుగా ఆయుష్మాన్ భారత్ యోజనాలలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పథకం లబ్ధి పొందుతారు. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అన్ని చికిత్సలు అందిస్తారు. కాస్మోటిక్ సర్జరీ, డెంటల్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్, ఒబెసిటీ, మానసిక సమస్యలకు మాత్రం చికిత్స అందించారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 2025 నిరుపేదకి కుటుంబాలకు 70 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లో కూడా దీనికి అర్హులు. ఇది వరకు వయస్సు పెద్ద ఉన్నవారికి ఆరోగ్య బీమా ప్రైవేటు రంగాలు అవకాశం ఇచ్చేవి కావు.
అర్హులు ఎవరంటే..
ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనలో భారత్ శాశ్వత నివాసితులై ఉన్నవారు మాత్రమే అర్హులు.
సీనియర్ సిటిజన్లు 70 ఏళ్లు పైబడిన వారు కూడా అర్హులు, వీళ్ళు కార్డు కలిగి ఉండాలి.
ఆదాయం అర్బన్, రూరల్ ఏరియాలకు నిర్దేశిత ఆదాయ పరిమితిని మించి ఉండకూడదు.
ఆయుష్మాన్ భారత్ యోజన పొందాలంటే అధికారిక వెబ్సైటులో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. అక్కడ మీ ఆధార్ కార్డు ఇతర వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ చేస్తే ఆధార్ కార్డు పొందుతారు.